![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్నా సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -81 లో.....నర్మద తన ఫ్రెండ్ తో చందు గురించి చెప్తుంది. మా పిన్ని వాళ్ళ అమ్మాయి ఉంది.. నేను వాళ్ళతో చెప్పి కాల్ చేస్తానని తను నర్మద తో అంటుంది. ఆ తర్వాత నర్మద ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంది. తన ఫ్రెండ్ కాల్ చేసి మా వాళ్లకి సంబంధం గురించి చెప్పాను.. వాళ్లు ఒకే అన్నారని నర్మద ఫ్రెండ్ అనగానే.. మరి మా పెళ్లిళ్ళు గురించి చెప్పావా అని నర్మద అడుగుతుంది. చెప్పానని తను అనగానే నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పాలనుకోని హాల్లోకి వస్తుంది.
అందరు అక్కడే ఉండడంతో బావగారికి ఒక సంబంధం వచ్చిందని చెప్తుంది. వద్దు నేను పెళ్లి సంబంధం చూస్తానని రామరాజు అనడంతో మీరు ఎందుకు వద్దని అంటున్నారో నాకు తెలుసు మావయ్య.. కానీ మా పెళ్లిళ్ల గురించి ఆల్రెడీ మా ఫ్రెండ్ వాళ్ళకి చెప్పిందట.. అందుకే మీకు చెప్తున్నానని అనగానే అందరు రామరాజుని ఒప్పిస్తారు. మరుసటి రోజు వేదవతి రెడీ అవుతుంది. రామరాజు గతంలో పెళ్లి చూపులు జరిగినప్పుడు వాళ్ళు అన్న మాటల గురించి బాధపడుతుంటే.. ఈ సారి అలా ఏం కాదని వేదవతి చెప్తుంది. మరొకవైపు నర్మద కుటుంబం గురించి ఆలోచిస్తున్నందుకు సాగర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత అందరు రెడీ అయి హాల్లోకి వస్తారు. నేను వంట చేయలేదు మీరే చేసుకోండని ప్రేమకి వేదవతి చెప్తుంది. అందరు కలిసి వెళ్తుంటే అదంతా చూసిన భద్రవతి.. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కోమని విశ్వకి చెప్తుంది.
ఆ తర్వాత రామరాజు కుటుంబం పెళ్లిచూపులకి వెళ్తారు. అది విశ్వ చూసి భద్రవతికి ఫోన్ చేసి చెప్పగానే.. వాళ్ళ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ కావాలని భద్రవతి విశ్వకి చెప్తుంది. మరొకవైపు అమ్మాయి, అబ్బాయిలు ఇష్టమని చెప్తారు. మాకు అన్ని విషయలు నర్మద ఫ్రెండ్ పద్మ చెప్పిందని అనగానే.. రామరాజు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు.అప్పుడే అమ్మాయి తండ్రి మళ్ళీ వస్తానంటూ వెళ్తాడు. తరువాయి భాగంలో అమ్మాయి తండ్రి వచ్చి ఈ సంబంధం వద్దు.. ఊరు, పేరు లేనోడి ఇంటికి నా కూతురిని ఇవ్వను అని అనగానే.. రామరాజు కుటుంబం వెళ్లిపోతారు. ఆ తర్వాత సాగర్, నర్మదలు గొడవ పడతారు. సాగర్ నర్మదపై చెయ్ ఎత్తుతాడు. అది చూసి రామరాజు కోప్పడతాడు. సాగర్ పై రామరాజు చెయ్ ఎత్తుతుంటే నర్మద ఆపుతుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |